CBI SO Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 62 స్పెషల్ ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేదీదే..!

by Maddikunta Saikiran |
CBI SO Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 62 స్పెషల్ ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేదీదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై(Mumbai)లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(CBI) హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్(HCM) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న 62 స్పెషల్ ఆఫీసర్(SO) పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.centralbankofindia.co.in/en ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 12 జనవరి 2025.

పోస్టులు, ఖాళీలు:

స్పెషల్ ఆఫీసర్(SO) - 62

విద్యార్హత:

ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్ పూర్తి చేసి ఉండాలి. అలాగే సిక్స్ ఇయర్స్ పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

జనరల్/ ఓబీసీ అభ్యర్థులు రూ. 750+GST ఫీజు చెల్లించాలి. మిగతా కేటగిరీ వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed