- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు?

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. హైదరాబాద్నగరంలోని గోషామహల్ సెగ్మెంట్ నుంచి 2014 నుంచి ఇప్పటి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన నియోజకవర్గం అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉంటుంది. అయినప్పటికీ ఈ మార్చిలో షురూ అయిన బడ్జెట్సెషన్స్ లో ఒక్కరోజు కూడా హాజరు కాలేదు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న రాజాసింగ్ప్రభుత్వంపై విరుచుపడే వీలున్నప్పటికీ ఆయన అసెంబ్లీకి రాకుండా ఎందుకు దూరంగా ఉంటున్నారనే దానిపై చర్చా కొనసాగుతోంది. రాజాసింగ్ఎక్కడున్న తనదైన మార్క్‌ను చూపించే నేత.. అయితే సమావేశాల వేళ సైలెన్స్ గా ఉండడం వెనుక అంతర్యమేమిటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అసంతృప్తినా..లేక పార్టీ అంతర్గత సమస్యలా?
ఎమ్మెల్యే రాజాసింగ్ కు పార్టీలోనే ఒక రెబల్అన్న పేరున్నది. అయితే, బీఆర్ఎస్హయంలో హైదరాబాద్నగరం నుంచి బీజేపీ ఏకైకంగా గెలిచిన వ్యక్తి. గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నుంచి ఎనిమిది మంది గెలుపొందగా గోషామహల్ నుంచి రాజాసింగ్మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈక్రమంలోనే తనకు అసెంబ్లీ ఎల్పీ లీడర్ గా అవకాశం ఇవ్వాలని బీజేపీ అదిష్టానాన్ని కోరినట్లు తెలిసింది. సీనియర్‌నేత అయిన రాజాసింగ్‌కు పార్టీ ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. దీనికితోడు రాజాసింగ్ సొంత పార్టీ నేతలపైనే వ్యాఖ్యలతో ఆయన రెబల్‌గా మారారు. ప్రస్తుతానికి సీరియస్‌గా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వాన్ని నిలదీసే ఛాన్స్ఉన్నప్పటికీ ఆయన అసెంబ్లీకి దూరంగా ఉన్నారు.
అయితే, తనకు శాసన పక్ష నేతను చేయకపోవడంపై అసంతృప్తితో ఉన్నారని, దాంతోనే రాజాసింగ్అసెంబ్లీకి రావడం లేదని పార్టీ వర్గీయులు చర్చించుకుంటున్నారు. దీనికితోడు పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యల వల్లే ఈ సమావేశాలకు దూరంగా ఉన్నారని పార్టీలో మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఈనెల 12వ తేదీన ప్రారంభమై పది రోజులుగా కొనసాగుతన్న బడ్జెట్ సమావేశాలలో గోషామహల్ఎమ్మెల్యే కానరాకపోవడంపై రాజాసింగ్ఎక్కడ? అని పలువురు చర్చించుకోవడం గమనార్హం. ఆయన అసెంబ్లీకి హాజరుకాకపోవడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటన్నదానిపై పార్టీ వర్గాల్లోనే కాకుండా సర్వత్రా చర్చనీయంశంగా మారింది.