ఐదు తరాల.. షావుకారు కుటుంబం.!

by Daayi Srishailam |
ఐదు తరాల.. షావుకారు కుటుంబం.!
X

అదృష్టమంటే ఏంటో తెలుసా.?

అమ్మమ్మ.. నాన్నమ్మలతో గడిపే అవకాశం దొరకడం.

కానీ.. ఇప్పుడుందా ఆ ఛాన్స్.?

తరతరానికి అంతరం పెరుగుతోంది.

అమ్మమ్మ.. నాన్నమ్మెవరో పిల్లలకు తెలియడం లేదు.

మనవళ్లు.. మనవరాళ్లను చూసే భాగ్యం పెద్దలకూ దక్కడం లేదు.

కానీ ఒక ఫ్యామిలీ ఉంది.

''ద మోస్ట్ లక్కీయెస్ట్ ఫ్యామిలీ'' అని చెప్పొచ్చు.

ఐదుతరాల అందమైన కుటుంబం అది.

ఈ తరం తెలుసుకోవాల్సిన సుకుటుంబ కథా చిత్రం ఇది.

- దిశ, ఫీచర్స్

''మా అమ్మమ్మ వాళ్ల అమ్మమ్మ''.. అనే పదం ఈ రోజుల్లో వింటున్నామా.? మహా అయితే ''అమ్మమ్మ'' దగ్గరే ఆగిపోతాం. అదికూడా ''మా అమ్మమ్మ/నాన్నమ్మ ఉండేదట.. అనేదట'' అని ''అట'' దగ్గరే ఆగిపోతాం. కానీ.. వారితో మంచి అనుబంధం ఉంది.. వారితో గడిపే అదృష్టం దొరికింది అనే చెప్పేవారు లేరు. జీవితం అంతే బ్రో.. కొందరికేమో అవకాశం రాదు. వచ్చినవారేమో దగ్గరున్నంత సేపు పట్టించుకోరు.. దూరమయ్యాక బాధపడతారు.

5జీ జానకి

3జీ.. 4జీ టెక్నాలజీకే కాలం చెల్లిపోయింది. ఇక ఔట్ డేటెడ్ మనుషుల గురించి ఎందుకూ అని పొరపాటున అనుకోకండి. ఒకసారి గూగుల్‌ని అడగండి ''హూ ఈజ్ షావుకారు జానకి'' అనీ. ఈ AIల జమానాలోనూ ఒక గోల్డెన్ పర్సనాలిటీ అని మీకు తెలుస్తుంది. షావుకారు జానకీ ఒక అప్డేట్ వర్షన్ అరుదైన తార. అలనాటి అందాల హీరోయిన్. నటనతో.. అందంతో.. అభినయంతో తెలుగు.. తమిళం.. మళయాలం సినిమాలను విజయాల బాటపట్టించి కోట్లాది ప్రేక్షకులను సంపాదించి పెట్టుకున్న క్యారెక్టర్. తొలి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొని ఐదు తరాల ప్రేక్షకులను అలరించి 5జీ జానకీగా మారిపోయింది.

ఎంత అదృష్టమో.?

సోషల్ మీడియాలో చాలామంది షావుకారు జానకి గురించి పోస్టులు పెడుతున్నారు. ''నిజంగా అదృష్టమంటే ఆమెదే'' అని కామెంట్లు చేస్తున్నారు. ''ఇంకో తరాన్ని కూడా చూడాలని ప్రార్థిస్తున్నాం'' అంటున్నారు. అవన్నీ ఎందుకో తెలుసా.? ఆమె తన ఐదు తరాల కుటుంబంతో హాయిగా.. ఆనందంగా ఉంటున్నారు. మనకూ అనిపిస్తుంది కదా అమ్మమ్మతో గడపాలి.. నాన్నమ్మతో ఉండాలి అనీ. మనలో ఎంతమందికి అలాంటి అవకాశం ఉందో లేదో తెలియదు కానీ జానకి అయితే తన ముని మనవరాళ్ల మనవళ్లతో కూడా ఉల్లాసంగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

ఇదీ కుటుంబ చిత్రమ్

షావుకారు జానకి 12 డిసెంబర్, 1931వ సంవత్సరంలో జన్మించారు. అంటే ఇప్పుడామె వయసు 93 సంవత్సరాలు. షావుకారు జానకి కూతురు యజ్ఞప్రభ. యజ్ఞప్రభ కూతురు వైష్ణవి. వైష్ణవి కూతురు అదితి. అదితి కూతురు మేఘన. ఒకటి రెండు తరాలను చూడటమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో షావుకారు జానకి ఇన్ని తరాలను చూడటం నిజంగా గొప్ప విషయం. ఇలాంటివి చాలా అరుదు కూడా. 5 తరాల పిల్లలతో టైమ్ స్పెండ్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నారు జానకి. వీళ్లంతా కలిసి తాజాగా ఒక ట్రిప్‌కు వెళ్లారట. ఆ గ్రూప్ ఫొటో కాస్త వైరలయి.. ఈ ఫ్యామిలీ చర్చనీయాంశమైంది.

జానకి వేసిన బాట..

జానకి కూతురు యజ్ఞప్రభ సామాజిక సేవా రంగంలో ఉన్నారు. యానిమల్ వెల్ఫేర్ యాక్టివిస్టుగా ఆమె సేవ చేస్తున్నారు. యజ్ఞప్రభ కూతురు అంటే జానకి మనవరాలు వైష్ణవి అమ్మమ్మ అడుగుజాడల్లో నడిచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తెలుగు.. తమిళం.. మళయాలం.. కన్నడ సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చేసింది. శుభసంకల్పం.. పరువు ప్రతిష్ట.. అత్తింటిలో అద్దె మొగుడు.. ప్రేమ వంటి సినిమాల్లో నటించింది. వైష్ణవికి అదితి.. మేఘన ఇద్దరు కుమార్తెలు. వై దిస్ కొలవెరి కొలవెరి అనే మ్యూజిక్‌తో ఊపు ఊపిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ వైష్ణవికి సోదరుడు. రజనీకాంత్ భార్య లత స్వయాన వీరికి మేనత్త.

లివింగ్ లెజెండ్

  • కథా నాయికగా.. చెల్లిగా.. వదినగా.. తల్లిగా.. బామ్మగా ఎన్నో మరుపురాని పాత్రలు పోషించారు జానకి.
  • నిజ జీవితంనూ ఈ పాత్రలకు న్యాయం చేశారు.
  • అందుకే ఆమె లివింగ్ లెజెండ్.
  • సినిమాల్లోకి అడుగుపెట్టే నాటికి ఆమె ఒక బిడ్డకు తల్లి.
  • ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా స్వయంకృషితో ఎదిగారు.

ఐదు తరాలకు సాక్షి

  • షావుకారు జానకి అసలు పేరు టేకుమళ్ల జానకి.
  • తన తర్వాత చెల్లెలు క్రిష్ణకుమారిని కూడా సినిమాల్లోకి తీసుకొచ్చారు జానకి.
  • వినూత్న వ్యక్తిత్వం ఆమెది.
  • భర్తతో విడాకులు.. పిల్లల బాధ్యత చూసుకోవడం వంటి ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కున్నారు.
  • సినీ పరిశ్రమలోనూ.. వ్యక్తిత్వంలోనూ గంభీరంగా ఉంటూ ఐదు తరాలకు సాక్షిగా నిలిచిన కళా శిఖరం.
Next Story

Most Viewed