Viral Video: నీదేనా నాయనా రోజు మా ఫోన్‎లో వినిపించేది..కాల్ చేయగానే వచ్చే అవేర్నెస్ వాయిస్ ఈయనదే

by Vennela |
Viral Video: నీదేనా నాయనా రోజు మా ఫోన్‎లో వినిపించేది..కాల్  చేయగానే వచ్చే అవేర్నెస్ వాయిస్ ఈయనదే
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మాయమాటలు చెప్పి మన అకౌంట్స్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు కేటుగాళ్లు. లక్కీడ్రా అని , ఆఫర్స్ వచ్చాయని బ్యాంక్ లోన్స్ అని ఏవేవో చెబుతూ అమాయక ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్నారు. వారి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం, పోలీసు అధికారులు జాగ్రత్తలు చెబుతూనే ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఫోన్ లోనూ ప్రజలకచు అవగాహనా కలిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటూ అవేర్‌నెస్ కల్పిస్తున్నారు.

అయితే మనం ఎవరికైనా ఫోన్ చేస్తే ముందుగా జాగ్రత్త..లాటరీ గెలిచారు..ఇన్ స్టాంట్ లోన్స్ ఇస్తాము..ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించండి..అంటూ ఓ మెయిల్ వాయిస్ వినిపిస్తుంది. ఈ వాయిస్ మనకు అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ ప్రతిసారి ఫోన్ చేయగానే ఇదే వాయిస్ వినిపించడంతో కొంతమంది తిట్టుకునేవారు కూడా ఉన్నారు. అయితే ఇంతకూ ఆ వాయిస్ ఎవరిదో మీకు తెలుసా? పేరు శరత్. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. కానీ ఇప్పుడు ఏంటీ ఈ గో మాకు అంటూ నేటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


మా కంటికి ఒక్కసారి అవుపడే నీకు బడిత పూజ చేయాలని ఉంది. నీ వాయిస్ కు పెద్ద ఫ్యాన్స్ అయిపోయామే. మీరు నువ్వు చేయబట్టి రోజురోజు మేము చచ్చిపోతున్నాం అన్న..అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Emergency గా కాల్ చేస్తున్నప్పుడే ...అవతలి వాళ్ళు త్వరగా కాల్ లిఫ్ట్ చెయ్యాలి అనుకున్నపుడే సరిగ్గా అప్పుడే నీ వాయిస్ వొస్తుంది. ఫ్రీగా ఉండి కాల్ చేస్తున్నపుడు ఆ టైమ్ లో రాదు.. ఏంటి బ్రో అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఒరేయ్ నువ్వనా నీ వాయిస్ వినలేక చచ్చిపోతున్నాం రా బాబు అంటూ ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed