నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు : కామారెడ్డి కలెక్టర్

by Aamani |
నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు : కామారెడ్డి కలెక్టర్
X

దిశ, కామారెడ్డి : రోడ్డు భద్రత నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హల్ లో రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జాతీయ రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు అనుమతి లేకుండా పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మైనర్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గత మూడు నెలల్లో జరిగిన రోడ్డు యాక్సిడెంట్ వివరాలను అడిగి తెలుసుకుని వాటికి గల కారణాలను విశ్లేషించారు. కనీస రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించడం ద్వారా జరిగే రోడ్ యాక్సిడెంట్లను నివారించవచ్చని, వాటిని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.

జాతీయ రహదారిపై పరిమితికి లోబడి వాహనం వేగం ఉండాలని పరిమితికి మించి వాహనాన్ని నడిపితే స్పీడ్ గన్ ద్వారా గుర్తించి వారిపై ఫైన్ నమోదు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ...జిల్లాలో 28 బ్లాక్ స్పాట్లను ఇప్పటివరకు గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రమాదాలకు ముఖ్య కారణం వేకువజామున నిద్రలో, రాత్రి 8 గంటల తర్వాత, అతివేగంగా, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ చేయడమేనన్నారు. అనుమతించిన వేగం వరకే వాహనాలు నడపాలని, అతివేగంగా, రాంగ్ రూట్లో వాహనాన్ని నడిపి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదని తెలిపారు.

వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ ను తప్పకుండా పాటించాలన్నారు. ప్రతిరోజు వెహికల్ చెకింగ్ లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి వాటిని గుర్తించి వారికి జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు. మైనర్లకు వాహనాన్ని ఇచ్చినట్లయితే తల్లిదండ్రుల పైన కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏ ఎస్పీ చైతన్య రెడ్డి, డీటీవో శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హన్మంత్ రావు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, నేషనల్ హైవే అథారిటీ అధికారులు, ఆర్ అండ్ బి, ఇంజనీర్, పంచాయతీ రాజ్ రోడ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed