మద్యం మత్తులో ఎంత పని చేసుకున్నాడు

by Sridhar Babu |
మద్యం మత్తులో ఎంత పని చేసుకున్నాడు
X

దిశ‌,ఏటూరునాగారం : తాగిన మైకంలో వ్య‌క్తి పురుగుల మందు తాగి మృతి చెందిన ఘ‌ట‌న నూగూరు వెంక‌టాపురం మండ‌లంలో చోటు చేసుకుంది. ఎస్సై కొప్పుల తిరుప‌తిరావు క‌థ‌నం మేర‌కు వెంక‌టాపురం మండ‌లం చిరుతప‌ల్లి గ్రామానికి చెందిన చేలే మ‌ధు (31) అనే వ్యక్తి కొన్ని సంవత్స‌రాలుగా మ‌ద్యానికి బానిసై నిత్యం తాగుతూ ఏ ప‌నీ చేసేవాడు కాదు. అంతే కాకుండా తాగిన స‌మ‌యంలో మ‌తి స్థిమితం స‌రిగా లేన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తుండేవాడు. ఈ క్ర‌మంలోనే గ‌త ఎనిమిది సంవత్స‌రాల క్రితం తాగిన మైకంలో పురుగుల మందు తాగ‌గా భ‌ద్రాచలం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు.

గురువారం కూడా మద్యం సేవించి ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో పురుగుల మందు తాగాడు. అనంతరం అటు వైపు వ‌చ్చిన మ‌ధు బావ కొర్స సందీప్ చూసి మృతుని కుటుంబ స‌భ్యుల‌కు విషయం తెలిపాడు. దాంతో వారు వైద్యం నిమిత్తం వెంక‌టాపురం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కానీ అప్ప‌టికే ప‌రిస్థితి విష‌మించ‌డంతో మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా ఆసుపత్రికి త‌ర‌లిస్తుండ‌గా మ‌ధ్య‌లో మృతి చెందిన‌ట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతుడి త‌ల్లి చేలే సుగుణ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున‌ట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed