- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ధాన్యం కొనుగోళ్లపై జాప్యం ఎందుకు.. ఆగ్రహించిన అన్నదాతలు

దిశ ప్రతినిధి,రాజన్న సిరిసిల్ల : ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం ఎందుకు చేస్తున్నారంటూ జిల్లాలోని వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి, కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకొని పోవడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం సిరిసిల్ల, వేములవాడ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. టౌన్ సీఐ కృష్ణ రైతులకు నచ్చజెప్పి కలెక్టర్ ను కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. చివరకు రైతులు కలెక్టర్ కలిసి ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా కూడా ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం లేదని, కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి కోతలు పూర్తయి నెలలు గడుస్తున్నాయని, వర్షానికి ధాన్యం తడిసి ముద్దయి తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ఇదే విషయాన్ని మండల ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కలెక్టర్ ని కలిసి తమ గోడు విన్నవించుకుందామంటే పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. మండుటెండలో నిరసన చేపడుతున్న ఏ ఒక్క అధికారి కూడా స్పందించి లేదన్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. రైతులు తెలిపిన నిరసన కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి బీజేపీ నాయకులతో కలిసి మద్దతు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో దాదాపు 50 మందికి పైగా రైతులు పాల్గొన్నారు.