- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎన్ని అడ్డంకులు ఎదురైనా ట్రంక్ లైన్ పనులు పూర్తి చేస్తాం : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

దిశ, వనస్థలిపురం: మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన డ్రైనేజీ ట్రంక్ లైన్ పనులకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా త్వరలోనే పూర్తి చేయిస్తానని ఎల్బీనగర్ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం మన్సూరాబాద్ డివిజన్ లో పర్యటించారు. ఈ సందర్భంగా స్వాతి రెసిడెన్సీ దగ్గర ట్రంక్ లైన్ పనులు ఆగిపోవడంతో చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు .. బాలాజీ నగర్, ఫేజ్–2, లక్ష్మీ భవాని కాలనీ, టీ నగర్, కేవీఎన్ రెడ్డి కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ, అంజలి రెసిడెన్సీ, స్వాతి రెసిడెన్సీ, లక్ష్మీ ప్రసన్న కాలనీ, ఆదర్శ్ నగర్, పవన్ గిరి, ఎల్లారెడ్డి ఫేజ్– 2 తదితర కాలనీల ప్రజలు , కాలనీల నాయకులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిసి ట్రంక్ లైన్ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... ట్రంక్ లైన్ పనులు ఒక ప్రైవేటు స్థలంలో నుంచి వెళ్తున్న నేపథ్యంలో స్థల యజమానితో చర్చిస్తున్నట్లు తెలిపారు. ట్రంక్ లైన్ నిర్మాణం స్థల యజమాని ఒప్పుకున్నా... కొందరు అతడిని బెదిరించడంతో ట్రంక్ లైన్ పనులు నిలిచిపోయినట్లు వివరించారు. ట్రంక్ లైన్ ఔట్ లెట్ పనులపై కాలనీవాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎల్బీనగర్ అభివృద్ధే తన లక్ష్యం అని, పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జక్కిడి రఘువీరా రెడ్డి, అనిల్ కుమార్ తో పాటు వివిధ కాలనీ సంఘాల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.