- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మందుల సామేల్ కు మంత్రి పదవి ఇవ్వాలి

దిశ,తుంగతుర్తి: మాదిగ సామాజిక వర్గానికి చెందిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ కు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న (బియన్) సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన తుంగతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధిలో వెనకడుగు వేసిన తుంగతుర్తిని కేవలం 15 మాసాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 14 వందల కోట్ల నిధులు తీసుకొచ్చి తుంగతుర్తిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని వివరించారు. అంతేకాకుండా నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై ప్రతి సందర్భంలో జరిగే శాసనసభ సమావేశాలలో ఎమ్మెల్యే సామేల్ ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ నిధులు తీసుకొస్తున్నారని తెలిపారు. తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలోనే ఎవరు చేయని తరహాలో ఎమ్మెల్యే సామేల్ నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు సంబంధిత జిల్లా,ఇతర ప్రాంతాల మంత్రులను కలుస్తున్నారని తెలిపారు. ఇది ఇలా ఉంటే రాష్ట్రంలో సుమారు 33 లక్షల మంది మాదిగలు ఉన్నారని ,ఈ మేరకు సామేలుకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే మాదిగ సామాజిక వర్గానికి న్యాయం జరిగే అవకాశముందని తెలిపారు. అంతేకాకుండా తుంగతుర్తి నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు.