ఒక్క రోజులో 30.8 వేల టన్నుల బొగ్గు రవాణా

by Aamani |   ( Updated:2025-03-31 08:25:44.0  )
ఒక్క రోజులో 30.8 వేల టన్నుల బొగ్గు రవాణా
X

దిశ,రామగిరి : రామగుండం 3 ఏరియా సీహెచ్పీ నుండి రైలు మార్గం ద్వారా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో బొగ్గు రవాణా‌‌ చేసినట్లు ఆర్జీ3 జీయం ఎన్.సుధాకర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా సీహెచ్పీ అధికారులను, ఉద్యోగులను అభినందించారు.‌ బొగ్గు రవాణాకు సంబంధించి సోమవారం ఆర్జీ3 జీయం పత్రిక ప్రకటన విడుదల చేశారు. 30వ తేదీ ఆదివారం 15 రైల్వే రేకుల ద్వారా ఎన్టీపీసీకి 30,839 టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా రోడ్డు మార్గంలో మరో 200 టన్నుల బొగ్గు రవాణా జరిగినట్లు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో ఉద్యోగులందరూ కలసికట్టుగా పని చేస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను భద్రతతో సాధించాలని కోరారు.

Next Story

Most Viewed