- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నా కొడుకును బలిపశువును చేస్తున్నారు.. స్టార్ నటుడి తల్లి షాకింగ్ పోస్ట్

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్(Mohanlal) నటించిన లేటెస్ట్ మూవీ ‘L2: ఎంపురాన్’ (L2: Empuran). అయితే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran)కీలక పాత్రలో నటించడంతో పాటు.. దర్శకత్వం వహించగా మార్చి 27న థియేటర్స్‌లోకి వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో పలు సీన్స్ తొలగించాలని సోషల్ మీడియాలో బాయ్‌కాట్ ట్రెండ్‌ను కొనసాగిస్తున్నారు నెటిజన్లు. అంతేకాకుండా పలు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
‘L2: ఎంపురాన్’ ఓ వైపు భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద రాణిస్తున్నప్పటికీ దీనిపై నెట్టింట వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, పృథ్వీరాజ్ సుకుమారణ్ తల్లి ఫేస్‌బుక్ ద్వారా షాకింగ్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ఈ సినిమాలో సమస్యలు ఉన్నాయంటే వాటిలో అందరికీ భాధ్యత ఉంటుంది. ఎందుకంటే వారంతా స్క్రిప్ట్ చదివేసి ఉంటారు కాబట్టి. షూటింగ్ సమయంలో అందరూ ఉండి తెరకెక్కించారు. రచయిత కూడా పక్కనే ఉన్నారు. అవసరమైతే డైలాగుల్లో మార్పులు చేసేవారు. కానీ విడుదలయ్యాక పృథ్వీరాజ్ మాత్రమే జవాబుదారీ ఎలా అవుతాడు.
మోహన్‌లాల్ ఇందులో సన్నివేశాలు యాడ్ చేయించారు అనడంలో ఎలాంటి నిజం లేదు.నా కూమారుడు ఎప్పుడూ ఎవరి వ్యక్తిగత నమ్మకాలను వ్యతిరేకించలేదు. అయితే ‘L2: ఎంపురాన్’ తెర వెనుక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలుసు. పృథ్వీరాజ్ సుకుమారన్ అన్యాయంగా నిందిస్తున్నారు. తప్పుడు వార్తలు రాస్తున్నారు. అవన్నీ చూస్తుంటే నాకు బాధగా ఉంది. మోహన్‌లాల్ నా తమ్ముడితో సమానం. నా కుమారుడిని ఎన్నో సందర్భాల్లో పొగిడాడు. అయితే కొంతమంది నా కుమారుడిని బలిపశువును చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అతను ఎవరినీ మోసం చేయలేదు. దయచేసి రూమర్స్ క్రియేట్ చేయకండి’’ అని ఎమోషనల్ నోట్ పెట్టింది. ప్రస్తుతం సుకుమారణ్ తల్లి పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.