- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సమాచారం కావాలంటే స్కాన్ చెయ్యాల్సిందే!
by Aamani |

X
దిశ,భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 6,7 వ తేదీల్లో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం, మహా పట్టాభిషేకం కార్యక్రమాలను తిలకించడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాలు నుంచి లక్షలాది మంది భక్తులు భద్రాచలం వస్తారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ, సమాచార శాఖ ఆధ్వర్యంలో ఒక క్యూ ఆర్ కోడ్ రిలీజ్ చేశారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు భద్రాచలంలో భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు అన్ని తెలుస్తాయి. భక్తుల కోసం ఏర్పాటు చేసిన వసతి, ప్రసాదాల కౌంటర్లు, తలంబ్రాల కౌంటర్లు, ఉచిత వైద్య శిబిరం, వాష్ రూమ్స్, దర్శనం, ఇలా అన్ని విషయాలు ఆ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా తెలుస్తాయి. భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈ క్యూ ఆర్ కోడ్ వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
Next Story