- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పిడుగుపాటుకు ఇద్దరు కూలీలు మృతి

దిశ, పదర : నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం కోడోని పల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం పిడుగుపాటుతో ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలలోకి వెళితే సుంకరి సైదమ్మ (40), గాజుల వీరమ్మ (55), సుంకరి లక్ష్మమ్మ తదితరులు తమ గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో వేరుశనగ కాయలు తెంచేందుకు కూలీలుగా వెళ్లారు. మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఆరంభమైంది. పొలంలో ఒక దగ్గర నిలిచి ఉన్న కూలీలపై నేపథ్యంలో భారీ ఉరుములు మెరుపులు రావడంతో పిడుగు పడింది. ఈ సంఘటనలో సైదమ్మ, వీరమ్మ అక్కడికక్కడే మరణించగా, లక్ష్మమ్మ కు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన లక్ష్మమ్మను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వర్షం గ్రామంలో ఎక్కువగా వర్షం కురుస్తుండడంతో మృతదేహాలను ఆసుపత్రికి తరలించలేదు. తమ గ్రామానికి చెందిన మహిళలు ఇద్దరు మరణించడంతో కోడోని పల్లి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.