- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
పదేళ్ల పాలనలో రాష్ట్రం నాశనమైంది : మెదక్ ఎమ్మెల్యే

దిశ,పాపన్నపేట : గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో రాష్ట్రం నాశనమైందని, కమీషన్లతో మూటలు నింపుకున్నారే తప్ప అభివృద్ధి చేయలేదని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. గురువారం స్థానిక ఓ ఫంక్షన్ హాల్ లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అంతకుముందు పాపన్నపేటలో కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీవో రమాదేవితో కలిసి సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రోహిత్ రావు మాట్లాడుతూ.. గత పాలకుల మాదిరి మన పార్టీ వాడా ఇతర పార్టీ వాడా అని చూసుకుంటూ సంక్షేమ పథకాలు అందించే వారని ధ్వజమెత్తారు.
మన ప్రజా ప్రభుత్వం లో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరవేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ప్రజలు పురుగుల అన్నం తిన్న పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పంపిణీ చేపట్టామని, దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆనందం వెళ్లి విరుస్తోందన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాకుండా కొత్త పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామన్నారు. ఆహార భద్రత కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున చౌక ధరల దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు నరేందర్ గౌడ్, ఆకుల శ్రీనివాస్, శ్రీకాంతప్ప, నిటలాక్ష ప్ప, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.