‘లేని రంకును నాకు అంటగట్టారు’.. KTR సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
‘లేని రంకును నాకు అంటగట్టారు’.. KTR సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ(Telangana Assembly)లో బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) రెచ్చిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోలేదని.. తప్పు చేశారని కోర్టు నమ్మింది కాబట్టే జైలు వెళ్లారని కేటీఆర్ అన్నారు. ‘ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చి మన ఇంటి మీద డ్రోన్ ఎగరేస్తే ఊరుకుంటమా?, ఇంట్లో భార్య, బిడ్డను ఎవడో ఫొటోలు తీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?, నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ మీదకి డ్రోన్ పంపిస్తే ఊరుకుంటావా?.. అక్కడ నీ బిడ్డనో, భార్యనో ఉంటే వాళ్ళను ఇష్టం ఉన్నట్లు ఫోటో తీస్తే ఊరుకుంటావా?’ అని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.

అంతేకాదు.. ‘నా మీద లేనిపోని రంకులు అంటగట్టారు. నా కుటుంబాన్ని నిందించారు. ఆ సమయంలో చిన్న పిల్లోడు అయిన నా కుమారుడ్ని కూడా ఇష్టానుసారం మాట్లాడారు. మీ ఇంట్లో వాళ్లే ఆడవాళ్లు.. మా ఇంట్లో వాళ్లు కారా?’ అని అన్నారు. అయినా సీఎం రేవంత్ రెడ్డిని జైలుకు పంపింది ఆనాటి ప్రభుత్వం కాదని.. కోర్టులు పంపాయని అన్నారు. ముఖ్యమంత్రి చిలిపి హెచ్చరికలకు ఇక్కడ ఎవరూ భయపడరు అని తెలిపారు.

అసలు సీఎం రేవంత్ రెడ్డి ఇంత కంగారు ఎందుకు పడుతున్నారో తమకు తెలియట్లేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను పక్కన పడేసి నిత్యం బీఆర్ఎస్‌పైనే విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఇంతవరకూ ఒక్క గ్రామంలో కూడా వందశాతం రైతు రుణమాఫీ జరుగలేదని అన్నారు. ఏ ఒక్కగ్రామంలోనైనా వందశాతం రుణమాఫీ అయితే నేను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటా అని సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. కొండారెడ్డిపల్లి పోదామా.? లేకుండా.. సిరిసిల్ల పోదామా..? అంటూ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Next Story