Ajay seth: ఆర్థిక శాఖ కార్యదర్శిగా అజయ్ సేథ్.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం

by vinod kumar |
Ajay seth: ఆర్థిక శాఖ కార్యదర్శిగా అజయ్ సేథ్.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి అజయ్ సేథ్‌ (Ajay seth)ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. అజయ్ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలపగా సిబ్బంది మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఆర్థిక శాఖ సెక్రటరీగా ఉన్న తుహిన్ కాంత్ పాండే (Thuhin kanth pandey) ఇటీవల సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్మన్‌గా నియామకం కావడంతో ఈ పదవి ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం అజయ్ సేథ్‌ను అపాయింట్ చేసింది. దీంతో త్వరలోనే ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, అజయ్ కర్ణాటక కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల శాఖలో కార్యదర్శిగా ఉన్నారు.

2021ఏప్రిల్‌లో అజయ్ ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆయన కేంద్ర బడ్జెట్‌లను రూపొందించడం, మౌలిక సదుపాయాల పెట్టుబడులను సులభతరం చేయడం, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వంటి బహుపాక్షిక సంస్థలతో సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ ఆర్థిక వేదికల్లోనూ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. జీ20 వర్కింగ్ గ్రూపులకు సహకరించారు. ప్రపంచ ఆర్థిక సవాళ్లు, దేశీయ ఆర్థిక పునరుద్ధరణ వ్యూహాలకు ప్రభుత్వ ప్రతిస్పందనను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక పదవిలో నియమించింది.

Next Story

Most Viewed