- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Government:స్కూల్ విద్యార్థులకు అలర్ట్.. విద్యా విధానంలో కీలక మార్పులు

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల(Government School) విద్యా విధానం పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. గత వైసీపీ(YSRCP) ప్రభుత్వం కేంద్రప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానం ఎన్‌ఈపీకి అనుగుణంగా ఆరు రకాల పాఠశాలలను తెస్తూ జీవో 117 ను అమలు చేసింది. దీంతో ఆరు రకాల స్కూళ్లను అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ(Andhra Pradesh)లో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ పై దృష్టి పెట్టింది.
ఈ క్రమంలో పాఠశాల విద్యా విధానం పై రాష్ట్ర ప్రభుత్వం(AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ హయాంలో అమలు చేసిన పాఠశాల విద్యలో జీవో-117 ను రద్దు చేయనున్నట్లు సమాచారం. ఇటీవల 5 రకాల పాఠశాలలు తీసుకురావాలని రాష్ట్ర విద్యాశాఖ(Education Department) భావించిన విషయం తెలిసిందే. కానీ పరిస్థితుల కారణంగా 9 రకాలుగా మారినట్లు సమాచారం.
ఈ క్రమంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా విధానంలో 9 రకాల పాఠశాలలు రాబోతున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ప్రాథమికంగా జాబితాను రూపొందించారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఉన్న 6 రకాల బడుల స్థానంలో 9 రకాల బడులు రానున్నాయి. అయితే ఉన్నత పాఠశాలల్లోనే 4 రకాలు బడులు రానున్నాయి. ప్రాథమిక బడుల్లో 45 మంది లోపు ఉంటే బేసిక్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు(Primary High School)గా పిలుస్తారు.
45మంది కంటే విద్యార్థులు(Students) ఎక్కువ ఉంటే తరగతి ఒక టీచర్‌ను కేటాయిస్తారు. వీటిని ఆదర్శ ప్రాథమిక ఉన్నత పాఠశాలలుగా పిలుస్తారు. ఇక, 1 నుంచి 10వ తరగతులు ఉండే బేసిక్, ఆదర్శ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు రాష్ట్రంలో 900 వరకు ఏర్పటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇంటర్మీడియట్‌తో(Intermediate) ఉన్నవి హైస్కూల్‌గా, కొన్ని ప్రాథమికోన్నత బడులుగా ఉంటాయి.