డీలిమిటేషన్‌పై మోడీని కలవనున్న తమిళ ఎంపీలు

by John Kora |
డీలిమిటేషన్‌పై మోడీని కలవనున్న తమిళ ఎంపీలు
X

- కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగుతుంది

- పునర్విభజన పారదర్శకంగా జరగాలి

- తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2026లో చేపట్టనున్న లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై తమ ఒత్తిడి కొనసాగిస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. డీలిమిటేషన్ కసరత్తును న్యాయంగా, పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు ఎంపీల ప్రతినిధి బృందం త్వరలో ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నట్లు సోమవారం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. డీలిమిటేషన్‌ను న్యాయంగా చేపట్టాలని కోరుతూ ఏర్పాటు చేసిన జేఏసీ తొలి సమావేశం శనివారం చెన్నై వేదికగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ప్రకటనను అసెంబ్లీలో చేస్తూ.. జనాభా నియంత్రణను శ్రద్దగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలు శిక్షాంపబడకూడదని స్టాలిన్ పునరుద్ఘాటింాచరు. 2024 ఫిబ్రవరిలో డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన మొట్టమొదటి రాష్ట్రం తమిళనాడే అని ఆయన గుర్తు చేశారు.

నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలకమైన అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రయత్నలు కొనసాగిస్తుందని స్టాలిన్ చెప్పారు. మార్చి 5న తన అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశమే జేఏసీ సమావేశానికి నాంది అని స్టాలిన్ అన్నారు. లోక్‌సభలో సీట్ల సంఖ్య రాష్ట్రాల వారీగా పునర్విభజించడాన్ని స్తంభింప చేయాలని, 2026 తర్వాత మరో పాతికేళ్ల పాటు దీన్ని పొడిగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యేలు ఒక తీర్మానాన్ని ఆమోదించారని స్టాలిన్ చెప్పారు. కేరళ, తెలంగాణ, పంజాబ్ ముఖ్యమంత్రులు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి జేఏసీ సమావేశంలో పాల్గొన్నారని స్టాలిన్ చెప్పారు. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ఎంపీలతో పాటు ఒడిషా, పంజాబ్ రాష్ట్రాల ఎంపీలు కూడా పీఎం మోడీని కలవాలని జేఏసీ నిర్ణయించినట్లు తెలిపారు. న్యాయమైన డీలిమిటేషన్ కోసం తమిళనాడు పోరాడుతుందని, ఈ విషయంలో మద్దతు ఇచ్చినందుకు ప్రధాన ప్రతిపక్షమైన ఏఐడీఎంకేతో పాటు ఇతర పార్టీలకు కూడా స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

Most Viewed