DK Aruna : మహబూబ్ నగర్లో ఐఐఐటీ ఏర్పాటు చేయాలి : లోక్ సభలో డీకే అరుణ

by M.Rajitha |
DK Aruna
X

దిశ, వెబ్ డెస్క్ : తమకు ఐఐఐటీ(IIIT) కేటాయించాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ(MP DK Aruna) కేంద్రాన్ని కోరారు. లోక్ సభ(LokSabha) సమావేశాల్లోని జీరో అవర్(Zero Hour) లో ఎంపీ డీకే అరుణ గురువారం మాట్లాడుతూ.. మహబూబ్ నగర్(Mahabub Nagar) జిల్లాలో ఐఐఐటీ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు. తన పార్లమెంటరీ నియోజక వర్గంలో ఉన్నత విద్యావకాశాలు కల్పించాలని కేంద్రానికి నివేదించారు. పాలమూరు జిల్లాల్లో అనేక పరిశ్రమలు(Industries) ఉన్నాయని.. కాని ఐఐఐటీ వంటి ఉన్నత శిక్షణా సంస్థలు లేకపోవడం వలన స్థానిక యువకులకు ఉద్యోగావకాశాలు రావడం లేదని అన్నారు. గత దశాబ్దపు కాలం కిందటి వరకు పనుల కోసం వలస వెళ్ళేవారని, ప్రస్తుతం ఉద్యోగాల కోసం యువత ఇతర నగరాలకు వలస వెళుతున్నారని అన్నారు. జిల్లాలోనే ఐఐఐటీ ఏర్పాటు చేస్తే యువతకు పుష్కలమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మహబూబ్ నగర్ కు ఐఐఐటీ మంజూరు చేసే అంశం పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నట్టు సభలో అరుణ తెలియ జేశారు.

Next Story

Most Viewed