Bazooka: మెగాస్టార్ లేటెస్ట్ మూవీ ట్రైలర్ చూడాల్సిందే.. సీరియస్ అండ్ స్టైలిష్ లుక్‌లో హీరో

by sudharani |
Bazooka: మెగాస్టార్ లేటెస్ట్ మూవీ ట్రైలర్ చూడాల్సిందే.. సీరియస్ అండ్ స్టైలిష్ లుక్‌లో హీరో
X

దిశ, సినిమా: మలయాళ (Malayalam) మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బజూక’ (Bazooka). థియేటర్ ఆఫ్ డ్రీమ్స్ (Theater of Dreams), వై నాట్ స్టూడియోస్ (Why Not Studios) బ్యానర్‌లపై డేవిన్ కురియకోస్, జిను వి అబ్రహం, విక్రమ్ మోహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దీనో డెన్నిస్ (Dino Dennis) దర్శకత్వం వహిస్తున్నారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘బజూక’ నుంచి ఇప్పటికే వచ్చిన పలు అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఇక ట్రైలర్ (trailer) విషయానికి వస్తే.. ‘ఓ సీరియల్ కిల్లర్ అమ్మాయిలను కిడ్నాప్ చేస్తూ ఉంటాడు. అతడిని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమవుతారు. అలాంటి సమయంలో వారికి మమ్ముట్టి అవసరం పడుతుంది. దీంతో ‘ఆయన మిస్టర్ నోబడి.. కానీ కచ్చితంగా ఆయనలో ఏదో ఉంది.. క్లాసీ, అందమైన వాడు.. ఇక అతను ఇబ్బంది పెట్టేవాడా అని మీరు నన్ను అడిగితే మాత్రం నాకు తెలియదు’ అంటూ మమ్ముట్టి పాత్రను పరిచయం చేస్తాడు ఆ పోలీస్ ఆఫీసర్. ఇందులో మమ్ము్ట్టి స్టైలిష్ లుక్‌లో.. ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ప్రజెంట్ ‘బజూక’ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంటోంది.


Next Story

Most Viewed