భారీగా తరలిస్తున్న విమల్.. చాకచక్యంగా పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు..

by Sumithra |
భారీగా తరలిస్తున్న విమల్.. చాకచక్యంగా పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు..
X

దిశ, వరంగల్ : నగరంలో ఎలాంటి అనుమతులు లేకుండా విమల్ పాన్ మసాలా సరఫరా చేస్తున్నారనే సమాచారం మేరకు శుక్రవారం ఉదయం భారీగా విమల్ పాన్ మసాలా పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా విమల్ పాన్ మసాలా అక్రమంగా సరఫరా చేస్తున్నారనే సమాచారం మేరకు శుక్రవారం ఉదయం ఉర్సు గుట్ట ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తమ బృందంతో తనిఖీలు నిర్వహించారన్నారు.

ఈ తనిఖీల్లో ఒక డీసీఎం, ఒక ట్రాలీ ఆటోలో అక్రమంగా, ఎలాంటి అనుమతులు లేకుండా సరఫరా చేస్తున్న 12 లక్షల 48 వేల విలువ గల విమల్ పాన్ మసాలా దొరికాయన్నారు. అలాగే పాన్ మసాలా తరలిస్తున్న యండి.జమీల్ అహ్మద్, గోపాల మధు, భీం రెడ్డిలను అదుపులోకి తీసుకొని పాన్ మసాలా సీజ్ చేశామని తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకున్న సొమ్ముతో పాటు నిందితులను మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.

Next Story