- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Video Viral: లైక్స్ కోసం మాల్స్‌లో బౌన్సర్లతో హల్ చల్.. పబ్లిక్ న్యూసెన్స్.. నెటిజన్ల ఫైర్

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా(social media)లో రీల్స్ ద్వారా ఫేమస్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొందరు తమలోని ప్రత్యేకమైన టాలెంట్, కళలను, ఆలోచనలను రీల్స్ ద్వారా ప్రదర్శిస్తారు. మరికొందరు మాత్రం పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఫేమస్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం మాల్స్‌లో డబ్బులు ఇస్తా అంటూ.. ఓ ఆకతాయి (bouncers) బౌన్సర్లతో హల్ చల్ చేస్తున్నాడు. ‘ఇట్స్ మీ పవర్’ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియో పోస్ట్ చేశారు. ఓ మాల్లో దాదాపు ఆరు మందికి పైగా బౌన్సర్లను ఏర్పాటు చేసుకోని తన ఫాలోవర్లకి డబ్బులిస్తాను.. కొండాపూర్‌లోని ఏఎంబీ మాల్‌కి వచ్చేయండని అంటూ అడ్రస్ చెబుతున్నాడు. దాదాపు 20 మందికి పైగా అతని చుట్టూ తిరుగుతూ హల్ చల్ చేశాడు.
ఇందుకు సబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు పోలీసులకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ట్యాగ్ చేశారు. అతను సెక్యూరిటీ గార్డులతో సైతం వాగ్వాదానికి దిగినట్లు ఆరోపణలు వచ్చాయి. మాల్లో పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడని, అతని అరెస్ట్ చేయాలని నెటజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక, సంధ్య థియేటర్ (Sandhya Theatre stampede) ఘటన అనంతరం ఓ వైపు (CM Revanth Reddy) సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (Hyderabad CP CV Anand) బౌన్సర్లకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. బౌన్సర్లపై ఆంక్షలు పెడుతుంటే ఇన్‌స్టాలో లైకుల కోసం మాల్స్ లో బౌన్సర్లతో ఆకతాయిలు హల్చల్ చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీసులకు ఎక్స్ వేదికగా ట్యాగ్ చేశారు.