ఛాయ్ తాగేంత లోపే జీవో ఇస్తానన్న ముఖ్యమంత్రి ఎక్కడ..? : బోథ్ ఎమ్మెల్యే

by Aamani |
ఛాయ్ తాగేంత లోపే జీవో ఇస్తానన్న ముఖ్యమంత్రి ఎక్కడ..? :  బోథ్ ఎమ్మెల్యే
X

దిశ, ఆదిలాబాద్ : సమగ్ర శిక్ష ఉద్యోగుల క్రమబద్దీకరణపై ఛాయ్ తాగే లోపే జీవో విడుదల చేస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గత 19 రోజులుగా దీక్ష చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఆయన సంఘీభావం తెలిపారు. సభ్యుల కోరిక మేరకు శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫోన్ లో సంప్రదించి సమ్మె సభ్యులకు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యా శాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు వారి న్యాయమైన హక్కుల కోసం చేస్తున్న పోరాటాలకు తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన సమగ్ర శిక్ష ఉద్యోగాల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఉద్యోగులు అర్థనగ్న ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు.ఇందులో ఉద్యోగులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed