KTR : కొడుకు హిమాంశు పాట..గర్వంగా ఉందన్న కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-28 10:37:42.0  )
KTR : కొడుకు హిమాంశు పాట..గర్వంగా ఉందన్న కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : తండ్రి పట్ల తన ప్రేమాభిమానాలను, గౌరవాన్ని చాటుతూ కొడుకు(Son) హిమాంశు రావు(Himanshu Rao) పాడిన పాట(Song)ను ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR )పంచుకున్నారు. జూలైలో నా పుట్టినరోజు కోసం నా కొడుకు దీన్ని రికార్డ్ చేశాడని.. కానీ అది సంతృప్తికరంగా రాలేదని భావించి విడుదల చేయలేదని, తాను ఆ పాటను వారం క్రితం మొదటిసారి విన్నానని, హిమాంశు పాట సాహిత్యం..గానం అద్భుతంగా ఉందని, అతని గాత్రం నచ్చిందని(Loved the vocals) ప్రశంసించారు.

తాను దీని పట్ల తండ్రిగా ఎంతో (Super Proud)గర్వపడుతున్నానన్నారు. కష్టతరమైన సంవత్సరం(Difficult Year)లో నాకు ఉత్తమ బహుమతి(Best Gift) అందించిన బింకు(హిమాంశు)కు అభినందనలని కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా తన పాటను తండ్రి కేటీఆర్ ఇష్టపడి మెచ్చుకోవడం పట్ల సంతోషంగా ఉందంటూ హిమాంశు రీట్వీట్ చేశారు. ఆడియో నాణ్యత సరిగా లేకపోవడాన్ని అంతా క్షమించాలని..నాన్న ఔన్నత్యాన్ని గొప్పగా చాటిన సాహిత్యం కారణంగా నేను స్వరాన్ని భావోద్వేగాలను నియంత్రించుకోలేపోయానంటూ హిమాంశు పేర్కొన్నారు.


Advertisement

Next Story

Most Viewed