- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NASA : సూర్యుడికి చేరువగా వెళ్లినా.. ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ సేఫ్
దిశ, నేషనల్ బ్యూరో : ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ స్పేస్ క్రాఫ్ట్(spacecraft)పై అమెరికాకు చెందిన నాసా(NASA) కీలక ప్రకటన విడుదల చేసింది. సూర్యుడి(sun) అన్వేషణ నిమిత్తం దానికి దగ్గరగా వెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్ సేఫ్‌గానే ఉందని శుక్రవారం వెల్లడించింది. సూర్యుడి బాహ్య వాతావరణంగా పిలిచే కరోనా పొరలోని కణాలు మిలియన్ల డిగ్రీల వరకు ఎలా వేడెక్కుతాయనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి పార్కర్ సోలార్ ప్రోబ్‌ను పంపారు. ఈ ఏడాది డిసెంబరు 24న సౌర ఉపరితలానికి 6.1 మిలియన్ కిలోమీటర్ల దూరంలోకి వెళ్లి.. సూర్యుడికి అత్యంత దగ్గరగా పార్కర్ సోలార్ ప్రోబ్ చేరినట్లు తెలిపింది. ఇప్పటి వరకు ఏ స్పేస్ క్రాఫ్ట్ కూడా సూర్యుడికి ఇంత దగ్గరగా వెళ్లలేదన్నారు. పార్కర్ సోలార్ ప్రోబ్ ఇటీవలే సూర్యుడికి అతి సమీపంలోకి వెళ్లినప్పటి నుంచి తాత్కాలికంగా తమకు సిగ్నల్స్ అందలేదని అధికారులు పేర్కొన్నారు. దాని నుంచి సిగ్నల్స్ కోసం శుక్రవారం వరకూ వేచి చూడాలని భావించారు. ఈనేపథ్యంలో గురువారం రాత్రి పార్కర్ సోలార్ ప్రోబ్ నుంచి సిగ్నల్ వచ్చిందని మేరీలాండ్‌లోని జాన్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లేబోరేటరీ వెల్లడించింది.
కరోనా పొరపై ఏడేళ్లపాటు పరిశోధనలు జరపడమే ప్రాథమిక లక్ష్యంగా 2018లో పార్కర్ సోలార్ ప్రోబ్‌ను నాసా ప్రయోగించింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ 2021 ఏప్రిల్‌లో 28న తొలిసారి సూర్యుడి కరోనా పొరలోకి ప్రవేశించింది. పార్కర్ సోలార్ ప్రోబ్ 1,800 డిగ్రీల ఫారెన్‌హీట్ (982 డిగ్రీల సెల్సీయస్) వరకు ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. భారీ వేడిలోనూ కరగకుండా ఉండేందుకు.. ఈ స్పేస్ క్రాఫ్ట్ తయారీకి టంగ్‌స్టన్, నియోబియం, మాలిబ్డినమ్, సఫైర్ వంటి పదార్థాలను వాడారు. పార్కర్ సోలార్ ప్రోబ్ జనవరి 1న తన పరిశోధనలకు సంబంధించిన వివరణాత్మక టెలిమెట్రీ డేటాను భూమికి పంపనుందని నాసా పేర్కొంది.