- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నేను ఇతడికి అభిమానిని అయ్యాను’.. మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు(వీడియో వైరల్)
దిశ,వెబ్‌డెస్క్: సాధారణంగా చాలా మంది ప్రముఖ నాయకులు, సెలబ్రీటీలను ఫాలో అవుతుంటారు. అంతేకాదు వారు మాట్లాడే విధానాన్ని గమనిస్తుంటారు. వారి వేషధారణను కూడా ధరించి వారిలా మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తారు. అచ్చం వారి గొంతు వచ్చే విధంగా మిమిక్రీ కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అసలు విషయంలోకి వెళితే.. ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu)ని ఇమిటేట్ చేసిన ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియో తాజాగా మంత్రి నారా లోకేష్ వరకు వెళ్లింది.
ఈ వీడియో పై మంత్రి లోకేష్(Minister Nara Lokesh) స్పందిస్తూ.. నేను ఇతడికి అభిమానిగా మారిపోయాను అన్నారు. చంద్రబాబు గారిలా మాట్లాడడానికి, కనిపించడానికి అతడు ఎంత కష్టపడ్డాడో చూడండి అని ఆ వీడియోను తన ట్విట్టర్(X)లో షేర్ చేశారు. ఓ పెళ్లి వేడుకలో మిమిక్రీ ఆర్టిస్ట్ ఒకరు సేమ్ సీఎం చంద్రబాబులా వేషధారణలో కనిపించాడు. వేదికపైకి వచ్చి ఆయనలానే మాట్లాడి వధూవరులను ఆశీర్వదించారు. అచ్చం చంద్రబాబు వలె మాట్లాడి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ క్రమంలో ఈ వీడియోని ఓ అభిమాని షేర్ చేస్తూ..‘‘వామ్మో.. సడెన్‌గా చూసి మా పెద్దాయన అనుకున్నా. సేమ్ బాబుగారి లానే ఉన్నారు’’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ పోస్ట్‌ను మంత్రి నారా లోకేష్(Nara Lokesh) షేర్ చేస్తూ అతను కూడా సేమ్ ఆశ్చర్యానికి గురి కావడం అందరినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది.