- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్థానికంపై కాంగ్రెస్ గురి..మండల కమిటీల ఏర్పాటు కోసం కసరత్తు
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టిని సారిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం.. అదే స్ఫూర్తితో పార్టీని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
గల్లి గల్లిన.. బలోపేతం కావాలని..!!..
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, సీఎం రేవంత్ రెడ్డి పోరాటాలు వెలిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణాలయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు మూడు నియోజకవర్గాలు మినహాయిస్తే మిగతా అన్నిచోట్ల బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో విజయాలు సాధించారు. ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేలా అడుగులు వేస్తుంది. ఇదే నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకు వస్తున్న నేపథ్యంలో.. అసెంబ్లీ ఎన్నికలు.. స్థానిక సంస్థల ఎన్నికలకు.. పొంతన ఉండదు.. స్థానిక సంస్థల పోరాటం.. పార్టీలపరంగా కాకుండా.. వ్యక్తిగతంగా ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతతో తాము విజయం సాధించామనే, అపవాదాన్ని తొలగించుకోవడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒకవైపు తమకు ప్రధాన రాజకీయ శత్రువులైన బీఆర్ఎస్, బీజేపీలను మరింత దెబ్బతీయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వ్యూహరచనలు చేస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ కన్నా ముందుగా గ్రామ గ్రామాన.. పట్టణాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలన్నా సంకల్పంతో పార్టీ కీలక నేతలు ఉన్నారు.
మండల కమిటీల ఏర్పాటుకు సన్నద్ధం..
కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్టానం అడుగులు ముందుకు వేస్తోం. అసెంబ్లీ ఎన్నికల అనంతరం డీసీసీ అధ్యక్ష పదవి మినహాయించి మిగిలిన కమిటీలన్ని దాదాపుగా రద్దు అయ్యాయి. పార్టీ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లి.. పార్టీని మరింత బలోపేతం చేయాలన్న సంకల్పంతో కమిటీల ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధం అవుతోంది.
డీసీసీ అధ్యక్షుల మార్పు లేకుండానే..
గ్రామ, మండల కమిటీలు ఏర్పాటు కావాలంటే ముందుగా డీసీసీ అధ్యక్షుని ఎంపిక జరగాల్సి ఉంటుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీసీసీ అధ్యక్షుల ఎంపిక వ్యవహారం అధిష్ఠానానికి తలనొప్పిగా మారడంతో.. ఉన్నవారినే డీసీసీ అధ్యక్షులుగా కొనసాగించి కమిటీలను ఏర్పాటు చేసే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మండల, ఇతర కమిటీల ఏర్పాటుకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ ను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ కమిటీల ఏర్పాటు అనంతరమే స్థానిక సంబరం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.