- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ayodhya : జనవరి 1న అయోధ్యకు 5 లక్షల మంది.. మహాకుంభమేళా సీజన్‌లో 3 కోట్ల మంది
దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య(Ayodhya) రామయ్య సన్నిధికి జనవరి, ఫిబ్రవరి నెలల్లో భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. మహాకుంభ మేళా(Maha Kumbh) కోసం ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే భక్తజనంలో చాలామంది తిరుగు ప్రయాణంలో అయోధ్యను సందర్శించుకునే ఛాన్స్ ఉంది. మహా కుంభమేళా ప్రారంభమయ్యే జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 12 మధ్యకాలంలో దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు అయోధ్యకు వస్తారని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అధికార వర్గాలు అంచనా వేశాయి. ఇక జనవరి 1వ తేదీన అయోధ్య రామయ్య సందర్శనకు దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షల మంది భక్తులు వస్తారని భావిస్తున్నారు.
మహా కుంభమేళా కోసం ప్రయాగ్ రాజ్‌కు వచ్చే వారిలో దాదాపు 10 శాతం మంది అయోధ్యకు వెళ్తారని అంటున్నారు. మహా కుంభమేళాకు దాదాపు 25 కోట్ల మంది వచ్చే అవకాశం ఉన్నందున.. వారిలో దాదాపు 3 కోట్ల మంది అయోధ్య రామయ్య సన్నిధిని సందర్శిస్తారని అంచనా వేస్తున్నామని అయోధ్య మేయర్ గిరీశ్ పతి త్రిపాఠి తెలిపారు. ప్రస్తుతం ప్రతిరోజూ అయోధ్యకు లక్షన్నర మంది నుంచి 2 లక్షల మంది దాకా భక్తులు వస్తున్నారని చెప్పారు. కాగా, మహా కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది.