- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సందేశ్‌ఖాలీకి వెళ్లనున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం నార్త్24 పరగణాస్ జిల్లాలోని సందేశ్‌ఖాలీని సందర్శించనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు లైంగిక వేధింపుల వివాదం చెలరేగిన తర్వాత మమతా బెనర్జీ సందేశ్‌ఖాలీకి వెళ్లనుండటం ఇదే మొదటిసారి. ప్రజాపంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. 'తాను డిసెంబర్ 30న సందేశ్‌ఖాలిలో ప్రజా పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తాను. సార్వత్రిక ఎన్నికలకు ముందు సందేశ్‌ఖాలీకి వెళ్తారా అని నన్ను అడిగారు. వెళ్తానని ఆరోజే చెప్పానని' ముఖ్యమంత్రి ఆదివారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం వద్ద విలేకరులతో చెప్పారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం. ఇప్పటికే లక్ష్మీర్ భండార్, బంగ్లార్ బారీ, ఇతర పథకాలకు సంబంధించి పెండింగ్ కార్యక్రమాలను పూర్తి చేసాము. ఈ ప్రాంతంలోని దాదాపు 20,000 మంది లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందనున్నారు. వేదికపైనే నేరుగా వంద మందికి పథకాల సర్టిఫికెట్లు అందజేయాలని ఆశిస్తున్నాను' అని మమత తెలిపారు. అయితే, ప్రతిపక్ష బీజేపీ నేత సువెందు అధికారి సైతం ఒకరోజు తేడాతో సందేశ్‌ఖాలీకి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ముగిసిన మరుసటి రోజు 'జన సంజోగ్ యాత్ర' నిర్వహించనున్నట్లు సువెందు అధికారి ప్రకటించారు. కాగా, ఈ ఏడాది జనవరి మొదటివారంలో మాజీ తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్‌తో పాటు శిబాప్రసాద్ హజ్రా, ఉత్తమ్ సర్దార్ వంటి స్థానిక తృణమూల్ నేతలు మహిళలపై లైంగిక వేధింపులు, భూకబ్జాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంసమైన సంగతి తెలిసిందే.