Ind Vs Aus : సిడ్నీ టెస్ట్ నుంచి రిషభ్ పంత్ ఔట్?

by Sathputhe Rajesh |
Ind Vs Aus : సిడ్నీ టెస్ట్ నుంచి రిషభ్ పంత్ ఔట్?
X

దిశ, స్పోర్ట్స్ : భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఐదో టెస్ట్ నుంచి పంత్‌ను తప్పించనున్నట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. ఆయన స్థానంలో ధ్రువ్ జురెల్‌కు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. నాలుగో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 121/3 తో మ్యాచ్‌ను సునాయసంగా ‘డ్రా’ చేసేలా కనిపించింది. కానీ పంత్ సిక్స్ బాదేందుకు యత్నించి ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 155 పరుగులకే ఆలౌట్ అయి 184 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో సిడ్నీ టెస్ట్‌లో పంత్‌కు చోటుపై ప్రశ్నలు తలెత్తాయి. తాజా సిరీస్‌లో పంత్ 22 యావరేజ్‌తో 154 పరుగులు చేసి నిరాశ పర్చాడు. దీంతో ధ్రువ్ జురెల్ వైపు టీమ్ మెనేజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. జురెల్ పెర్త్ టెస్ట్‌లో ఆడి రెండు ఇన్నింగ్స్‌లో 11, 1 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా-ఏ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 80, 68 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మిడిల్ ఆర్డర్‌‌లో పంత్ విఫలమవడంతో జురెల్‌కు చాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed