- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భద్రకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు..
దిశ, హన్మకొండ : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దేవాలయానికి అమ్మవారి దర్శనమునకు బుధవారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి అమ్మవారి దర్శనమునకు భక్తులు బారులుతీరారు. భక్తుల సౌకర్యార్థం ధర్మదర్శనం, అతి శీఘ్రదర్శనం, విశిష్ట దర్శనం ఏర్పాట్లతో పాటు భక్తులకు సరిపడు విధంగా ప్రసాదములు తయారీ, మంచినీటి ఏర్పాట్లు తదితర వసతులు ఈఓ శేషు భారతి ఏర్పాటు చేశారు.
పోలీసు శాఖ ఏసీపీ నంది రాం నాయక్, మట్వాడ సీఐ గోపి, ఎస్ఐ నవీన్ కుమార్ తదితర పోలీసు వారి సమన్వయంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు పోలీసు సిబ్బందితో భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులలో వరంగల్ పశ్చిమ ఎం.ఎల్.ఏ నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే దంపతులు తదితరులున్నారు. ఆలయానికి విచ్చేసిన ప్రముఖులకు ఆలయ ఈ.ఓ శేషు భారతి, ప్రధానార్చకులు భద్రకాళి శేషులు మంగళ వాద్యాలతో ఘనస్వాగతం పలికారు. పూజానంతరం ప్రముఖులకు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేష వస్త్రాలు బహూకరించి ప్రసాదాలు అందజేశారు.