భవన నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

by Naveena |   ( Updated:2025-01-04 09:58:15.0  )
భవన నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
X

దిశ,బాన్సువాడ : బాన్సువాడ పట్టణ కేంద్రంలో రూ.37.50 కోట్లతో నూతనంగా నిర్మించే 100 పడకల ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు,ఎమ్మెల్యే, పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టరుతో వివరాలు అడిగి తెలుసుకొన్నారు. నాణ్యత లోపం లేకుండా నిర్మించాలని గడువులోగా పనులు పూర్తిగా చేరాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఎజాజ్, నార్ల రవీందర్, ఖలేఖ్,నర్శన్న చారి,రఘు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story