Ponnam Prabhakar: త్వరలో ఆర్టీసీలో 3 వేలఉద్యోగాలు భర్తీ: పొన్నం ప్రభాకర్

by Prasad Jukanti |   ( Updated:2025-01-06 13:07:30.0  )
Ponnam Prabhakar: త్వరలో ఆర్టీసీలో 3 వేలఉద్యోగాలు భర్తీ: పొన్నం ప్రభాకర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: త్వరలోనే ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలను భర్తీ (Recruitments in RTC) చేయబోతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. జనవరిలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గొప్ప పథకం అన్నారు. ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ఎక్కడికక్కడ సమ్మెలు చేశారని గుర్తు చేశారు. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల భాట పట్టించామన్నారు. సోమవారం హనుమకొండలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పర్యటించారు. ఈ సందర్భంగా 50 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను జెడా ఊపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) గతంలో కేసీఆర్ ఆర్టీసీ దండగ అని దాన్ని మూసేసేందుకు చివరి వరకు వెళ్లారన్నారు. కానీ కార్మికులు ఉధృతంగా దీక్షలు చేస్తే పార్టీపై ప్రభావం పడుతుందని చివరి నిమిషంలో యూ టర్న్ చేసుకున్నారన్నారు. గతంలో దండగా అన్న ఆర్టీసీని మేము పండగలా చేశామని, ఆర్టీసీ కార్మికులకు పూర్తి భద్రత ఇచ్చామన్నారు. సంక్రాంతి తర్వాత 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. గతంలో బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇళ్లు ఇచ్చారని ఇప్పుడు మేము పార్టీలకు, కులాలు మతాలతో ప్రమేయం లేకుండా నిజమైన అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. సాగుచేసే భూములన్నింటికీ రైతుభరోసా ఇస్తామన్నారు.

Advertisement

Next Story