- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్
by Naveena |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ జనవరి 05: జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను పరిశీలించి, సీసీ టీవీలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి.ప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్ రావు తదితరులు ఉన్నారు.
Advertisement
Next Story