Akhilesh: కాంగ్రెస్‌కు అఖిలేష్ యాదవ్ షాక్.. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు మద్దతు

by vinod kumar |
Akhilesh: కాంగ్రెస్‌కు అఖిలేష్ యాదవ్ షాక్.. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు మద్దతు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీకి సమాజ్ వాదీ పార్టీ (Sp) చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) షాక్ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) కు మద్దతు తెలిపారు. ప్రస్తుతం జరగబోయే ఎలక్షన్స్‌లో ఆప్‌కు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. బీజేపీని ఓడించగల సత్తా ఉన్న పార్టీకే తాము మద్దతిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రజలకు మరోసారి సేవచేసే అవకాశం ఆప్‌కు రావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. దీనిపై ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) స్పందించారు. తమకు మద్దతిచ్చిన అఖిలేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో తప్పకుండా విజయం తమదేనని దీమా వ్యక్తం చేశారు. మరోవైపు, దేశ రాజధానిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ మాయవతి వెల్లడించారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఎస్పీ, ఆప్‌లు భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్‌లు ఒంటరిగా బరిలోకి దిగుతుండగా ఆప్‌కు ఎస్పీ మద్దతివ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed