- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాబు బాగా చదువుకో..తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో
దిశ, రేవల్లి: వనపర్తి జిల్లా రేవల్లి మండల పరిధిలోని కొంకలపల్లి గ్రామంలో ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండ్ల జ్యోతి (28) భర్త సంజీవయ్య 8 ఏళ్ల క్రితం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరికి కృష్ణవంశీ, శివతేజ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. బుధవారం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పెద్ద కొడుకు దగ్గరికి వచ్చిన తల్లి.. ఇంటి తాళం ఇవ్వమని అడిగింది. తాళం చెవి తీసుకోని బాబు.. నువ్వు బాగా చదువుకో.. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో.. అంటూ వెళ్లిపోయింది. అప్పుడు ఏం అర్థం కాని కోడుకు మధ్యాహ్నం ఇంటికి వెళ్లి చూడగా తల్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గమనించారు. దీంతో చుట్టుపక్కల వారికి సమాచారం ఇవ్వడంతో స్థానికులు ఇంటి తలుపులు పగలగొట్టి మృతదేహాన్ని తీశారు.
ఇదంతా గమనిస్తున్న ఆ పసి పిల్లలకు ఏం జరిగిందో అర్థం కాలేదు. మరోవైపు ‘అమ్మకు ఏమైంది అన్నా..’ అంటూ తమ్ముడు దీనంగా అన్నను అడగడం అక్కడివారిని కంటతడి పెట్టించింది. ‘అమ్మ ఇక లేదు.. దేవుడి దగ్గరికి వెళ్లిపోయింది..’ అని రోదిస్తూ చెప్పినా అన్న మాటకు తమ్ముడు కూడా బోరున రోధిస్తూ అన్నను కౌగిలించుకున్నాడు. ఈ దృశ్యం అక్కడ చూస్తున్న వారిని ఒక్కసారిగా శోకం లోకి నెట్టేసింది. తన ఆరో ప్రాణంగా నిలిచి జన్మనిచ్చిన అమ్మ తమకు దూరం అయిందనే బాధతో ఆ చిన్నారులు మరింత దుఃఖంలోకి వెళ్లిపోయారు. తల్లి, తండ్రి లేని ఆ పిల్లలకు ప్రభుత్వం ఆదుకోవాలని, గురుకుల పాఠశాలలో చేర్పించి ఆ చిన్నారులను అండగా నిలవాలని, దాతలు సైతం చేయూతనివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు