- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Rasamai : టికెట్ల ధరలు పెంచమన్నావు..ఎందుకు పెంచావు : రసమయి ఫైర్
దిశ, వెబ్ డెస్క్ : సినిమా టికెట్ల రేట్లు పెంచమని(Movie Ticket Prices Increase)..అదనపు షోల(Additional Shows)ను అనుమతించబోమని(Not Allow).అసెంబ్లీలో అర్భాటపు మాటలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ఇప్పుడు ఎందుకు టికెట్ల రేట్ల పెంపుకు అనుమతించాడంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్(Former BRS MLA Rasamayi Balakishan) ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్మాత దిల్ రాజు దిల్ కు ఎంతకు అమ్ముడు పోయాడవని రేవంత్ రెడ్డిపై రసమయి మండిపడ్డారు. సినిమాలకు అదనపు ప్రదర్శనకు ఎందుకు? టికెట్లు రేట్లు ఎందుకు పెంచాలి..నిజాయితీగా నిలబడతా అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకున్నారని నిలదీశారు. దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల ధరల పెంపుకు, అదనపు షోలకు అనుమతి వెనుక జరిగిన గేమ్ ఛేంజ్ ఏమిటో ప్రజలకు తెలియాల్సిన అవసరముందన్నారు.
దిల్ రాజులో దిల్ ఆంధ్రవైపు, రాజు మాత్రమే తెలంగాణ వైపు ఉంటాడని మేం తెలంగాణ ఉద్యమం నుంచి కూడా చెబుతూ వస్తున్నామన్నారు. మొన్న దిల్ రాజు సంక్రాంతికి వస్తు్న్నాం.. సినిమా ఈవెంట్ లోనూ ఆయన తెలంగాణ ప్రజలు మటన్ ముక్కకు, కల్లుకు మాత్రమే ఊపునిస్తారు..సినిమాలకు ఇవ్వరంటూ అవమాకర వ్యాఖ్యలు చేశారని రసమయి విమర్శించారు. అందుకే తెలంగాణ ప్రజలు దిల్ రాజు సినిమాలను తిరస్కరించాలని, తెలంగాణ ప్రజలకు పనేమి లేదన్నట్లుగా మబ్బులా తెల్లారే 4గంటలకు వెళ్లి సినిమా చూడాల్సిన అవసరం లేదన్నారు.
ఎమ్మెల్సీ దేశపతి మాట్లాడుతూ దిల్ రాజు ఏనాడు తెలంగాణ వ్యక్తిగా వ్యవహరించలేదని, తెలంగాణలో సినిమాల విడుదల ఊపునివ్వకపోతే ఇక్కడ సినిమా వ్యాపారాలు మానేసి..మాంసం, కల్లు దుకాణాలు పెట్టుకో అని డిమాండ్ చేశారు. దిల్ రాజు తెలంగాణ ప్రజలను, సంస్కృతిని అవమానించేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సినిమా టికెట్ల ధరలు పెంచమన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పుడు రెట్ల పెంపుపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెండు నాల్కల ధోరణి మరోసారి బయట పడిందని....గేమ్ చేంజర్ కి ప్రత్యేక మినహాయింపులు ఎందుకని ప్రశ్నించారు. ఒకరి సినిమాకు ఒకలా మరొకరి సినిమాకు మరోకలా దంద్వ విధానాలను ప్రభుత్వం అనుసరిస్తుందని ఆరోపించారు.