Taliban: భారత్ మాకు ముఖ్యమైన మిత్రదేశం.. దుబాయ్ సమావేశం తర్వాత తాలిబన్ల ప్రకటన

by vinod kumar |
Taliban: భారత్ మాకు ముఖ్యమైన మిత్రదేశం.. దుబాయ్ సమావేశం తర్వాత తాలిబన్ల ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram misry) , ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన తాలిబన్ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ (Amir Khan Muttaqi) లు దుబాయ్‌లో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అనంతరం ముత్తాఖీ కీలక ప్రకటన చేశారు. భారత్ తమకు కీలకమైన మిత్ర దేశమని, ఇండియాతో రాజకీయ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయాలని ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ పాలన కోరుకుంటోందని తెలిపారు. ఈ విధానం తాలిబాన్ విదేశాంగ విధానానికి అనుగుణంగా ఉందని వెల్లడించారు. ఇరు పక్షాల మధ్య జరిగిన సమావేశం దౌత్య సంబంధాల స్థాయిని పెంచేందుకు ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఏ దేశానికీ ముప్పు కలిగించబోదని హామీ ఇచ్చారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి భారత ప్రభుత్వం, తాలిబాన్‌ల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి చర్చ ఇవే కావడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed