- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KTR: కేటీఆర్‌కు తండ్రి కేసీఆర్ డైరెక్షన్..! విచారణకు ముందు, తర్వాత ఫోన్‌లో మంతనాలు
దిశ, తెలంగాణ బ్యూరో: ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆయన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ భరోసా నింపే ప్రయత్నం చేసినట్టు తెలుస్తున్నది. మానసిక స్థైర్యం కోల్పోకుండా, కేసులను చట్టపరంగా ఎదుర్కోవాలని సూచించినట్టు సమాచారం. ఎంక్వయిరీ సందర్భంగా పోలీసులతో ఏ విధంగా వ్యవహరించాలి? ఎలాంటి భాషను ఉపయోగించాలి? అనే కోణంలో ఆయన పలు సూచనలు చేసినట్టు తెలిసింది. విచారణకు వెళ్లే ముందు తండ్రి కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడిన సందర్భంగా కేటీఆర్‌కు పలు సూచనలు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఎంక్వయిరీలో భయం, జంకు లేకుండా జరిగిన విషయాన్ని వివరించాలని కౌన్సెలింగ్ ఇచ్చినట్టు తెలిసింది. విచారణ పూర్తయిన తర్వాత కూడా కేసీఆర్ కేటీఆర్‌కు ఫోన్ చేసి, విచారణ జరిగిన తీరును తెలుసుకున్నట్టు పార్టీ వర్గాల్లో టాక్. ఎలాంటి ప్రశ్నలు అడిగారు? ఏం అన్సర్స్ ఇచ్చారు? మళ్లీ విచారణకు రమ్మన్నారా? అని ఆరా తీశారని తెలిసింది. బుధవారం రాత్రి కేటీఆర్ ఫాంహౌస్‌లో ఉన్న తండ్రితో భేటీ అయ్యేందుకు వెళ్తారనే ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఫాంహౌస్‌కు వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే అనుమానంతో అక్కడికి వెళ్లకుండా ఫోన్‌లో కేసీఆర్‌తో కేటీఆర్ మాట్లాడినట్టు తెలుస్తున్నది.
న్యాయ నిపుణులతో కేసీఆర్ సంప్రదింపులు
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో జరుగుతున్న విచారణ తీరుపై కేసీఆర్ ఫోన్ ద్వాKTR: కేటీఆర్‌కు తండ్రి కేసీఆర్ డైరెక్షన్..! విచారణకు ముందు, తర్వాత ఫోన్‌లో మంతనాలురా పలువురు ప్రముఖ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. ఏసీబీ మళ్లీ ఎంక్వయిరీకి పిలిస్తే ఎలాంటి ప్రశ్నలు సంధించే చాన్స్ ఉంది? అందుకు కేటీఆర్‌ను ఏవిధంగా ప్రిపేర్ చేయాలి? కేటీఆర్‌పై ఉన్న అభియోగాలు, నమోదు చేసిన సెక్షన్‌ల వల్ల అరెస్ట్ చేసే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? అనే కోణంలో ఆరా తీసినట్టు తెలుస్తున్నది.
నాడు, నేడు ఫాంహౌస్ నుంచే
ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత విచారణకు ఎదుర్కొనే సమయంలో కేసీఆర్ ఫాంహౌస్ నుంచి ఇంటికి రాలేదు. అక్కడి నుంచే ఆయన కవితతో ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడే ప్రయత్నం చేసినట్టు ప్రచారం జరిగింది. ఆమెను అరెస్ట్ చేసే సమయంలో కూడా కేసీఆర్ ఫాంహౌస్‌లోనే ఉన్నారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కవితనే నేరుగా తండ్రి కేసీఆర్ వద్దకు వెళ్లి కలిసి వచ్చారు. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కూడా కేటీఆర్ కోసం కేసీఆర్ హైదరాబాద్‌కు రాలేదు. తన ఫాంహౌస్ నుంచే అటు న్యాయవాదులు, ఇటు కేటీఆర్‌కు గైడెన్స్ ఇస్తున్నట్టు తెలిసింది.