- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తాగునీటి ఇబ్బందులు ఉండకుండా శాశ్వత చర్యలు : ఎమ్మెల్యే వంశీకృష్ణ
దిశ, అచ్చంపేట : పదరా మండలంలోని వివిధ గ్రామాలకు శాశ్వత మంచినీటి చర్యలు, తాత్కాలికంగా ఎదురవుతున్న సాంకేతిక లోపాలను అధిగమించేందుకు ప్రజల అవసరాల నిమిత్తం మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రత్యేక పైప్ లైన్ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారని అందుకోసం ప్రభుత్వం రూ. 38.50 లక్షల నిధులు కేటాయించిందని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. అందుకు సంబంధించిన పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదర మండల కేంద్రం శివారులో ఉన్న పేట్ పై నుంచి వంకేశ్వరం గ్రామం వరకు ఆ తదుపరి గ్రామాలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో.. ఇకనుండి ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, అన్ని గ్రామాలకు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా మిషన్ భగీరథ నీటి సరఫరా శాశ్వత పరిష్కారం జరగనుందన్నారు.
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం కృత నిత్యం తో పని చేస్తుందని, మండలం లో సీసీ రోడ్ల నిర్మాణాలతో పాటు, వివిధ ఆలయాల నిధులు కేటాయించడం జరిగిందని, ఆలయాలలో భక్తి పరవశం మరింత పెంచాల్సిన అవసరం ఉందని వీటితో పాటు ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా ఇతరులకు సహాయపడేలా కృషి చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు. అంతకుము పదరా మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నమూనా భవనానికి భూమి పూజ చేశారు. మండల కేంద్రంలోని శ్రీకృష్ణ ఆలయ మరమ్మత్తుల కోసం రూ. 15 లక్షల ప్రొసీడింగ్ ను ఆలయ కమిటీకి ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటయ్య, ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈ ఈ హేమలత, కుంద మల్లికార్జున్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.