AIDS: టాటూ వేసుకుంటున్నారా.. జాగ్రత్త వహించకపోతే అంతే సంగతి?

by Anjali |
AIDS: టాటూ వేసుకుంటున్నారా.. జాగ్రత్త వహించకపోతే అంతే సంగతి?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల టాటూ(Tattoo) వేసుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. కొంతమంది తల్లిదండ్రుల మీద ప్రేమతో వేసుకుంటే.. మరికొంత మంది స్టైల్ కు వేసుకుంటున్నారు. టాటూగా చేతులపై ఫ్లవర్స్ గానీ, ఢిఫరెంట్ నేమ్స్.. కొన్ని డేస్ నుంచి తమ అభిమానుల ఫొటోలు కూడా చేతులపైన కాదు ఏకంగా గుండెపై వేసుకుంటున్నవి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇటీవల నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Natural Beauty Sai Pallavi) ఫొటోను అభిమాని గుండెలపై వేసుకుని.. హీరోయిన్ చూపించి షాకిచ్చిన ఘటన చూసే ఉంటారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

టాటూ వేసుకుంటే బ్లడ్ డొనేట్(Donate blood) చేయొద్దని నిపుణులు చెబుతుంటారు. మరీ టాటూ వేసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? క్యాన్సర్(Cancer), ఎయిడ్స్ వంటివి వచ్చే అవకాశమున్నాయా? అని చాలా మందిలో సందేహాలు తలెత్తే ఉంటాయి. కాగా తాజాగా నిపుణులు దీనిపై క్లారిటీ ఇచ్చారు. టాటూవేసుకుంటే పలు జాగ్రత్తలు వహించాలని.. లేకపోతే రక్త మార్పిడితో సంబంధమున్న రోగాలు ఎయిడ్స్ వంటివి తలెత్తే చాన్స్ ఉందని చెబుతున్నారు. ఒరిజినల్ టాటూ వేసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం లేదని వెల్లడించారు. సూదితో వేసుకుంటే మాత్రం హెచ్ ఐవీ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు. కాగా ఒకవేళ టాటూ వేసుకుంటే కొత్త సూదుల్ని వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story