Sweaters: పిల్లలకు స్వెటర్లు కొనేముందు ఈ విషయాలు గమనించండి?

by Anjali |
Sweaters: పిల్లలకు స్వెటర్లు కొనేముందు ఈ విషయాలు గమనించండి?
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరిగిపోతుంది. జనాలు ఉదయం పూట, సాయంత్రం పూట బయటకెళ్లాలంటే చలికి వణికిపోతున్నారు. ముఖ్యంగా చలికాలం పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని వైద్యులు చెబుతూనే ఉంటారు. పైగా ఈ సీజన్‌లో పిల్లలకు స్వెటర్లు కొనే విషయంలో ఈ విషయాలు తెలుసుకోండని తాజాగా నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో పిల్లలు ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశముందని చెబుతున్నారు. కాగా పిల్లలపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. శీతాకాలంలో పిల్లలకు వెచ్చని, నిండైన దుస్తులు వేయడం తప్పనిసరి.

అయితే వెచ్చదనం కోసం స్వెటర్ వేస్తారన్న విషయం తెలిసిందే. ప్రతీ ఏడాది కొందరికీ కొత్త స్వెటర్ కొనడం వీలుకాదు. కాగా కొత్త స్వెటర్ కొనాలనుకుంటే ఈ టిప్స్ పాటించండని నిపుణులు చెబుతున్నారు. కేవలం చలికి మాత్రమే కాదు.. అందంగా కనిపించేలా ఉండేందుకు పిల్లలకు నచ్చిన పక్షులు, జంతువులు, సూపర్ హీరోస్, పూల వంటి బొమ్మలు ఉన్న స్వెటర్లు కొనండి. పిల్లలు కూడా వాటిని చూసి మురిసిపోతారు.

అలాగే చాలా మంది లేత నీలం రంగు, లేత గులాబీ రంగు స్వెటర్లు ఎంపిక చేసుకుంటారు. కానీ పిల్లలు మురికిగా చేసుకుంటారు కాబట్టి ముదురు రంగు కలర్స్‌వి కొనడం బెటర్. అలాగే ట్రెండీ దుస్తులు వేసుకోవడం వల్ల పిల్లలు చాలా స్టైలీష్ గా కనిపిస్తారు. వాటికి ఫుల్ హ్యాండ్స్, టోపీ ఉండేలా కూడా చూసుకోండి. అలాగే ఉన్ని స్వెటర్ కొనండి. అది రోజంతా వేసుకున్నా వచ్చగా ఉంటుంది. మెడ నుంచి పాదాల వరకు పిల్లల సంరక్షణ కోసం ప్యాంట్ అండ్ షర్ట్ కొనుగోలు చేయండి.

Advertisement

Next Story