- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘చదివింది చాలు ఇక ఇంటికొచ్చేయ్’.. కన్న కొడుక్కి తండ్రి టార్చర్

దిశ, సిటీక్రైం: రాష్ట్రంలో సైబర్ నేరాలకు ప్రభావితమైన ఓ మూడు గ్రామాలు.. ఇప్పుడు ఆ మోసాలు చేయాలని సొంత పిల్లలను వేధిస్తుండడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ అంశం పోలీసులను షాక్‌కు గురి చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారిని మార్వెల్ కాపిటా వాట్సాప్ గ్రూపులో చేర్చారు. ట్రేడింగ్ ప్రాఫిట్స్‌కు సంబంధించి కీలక టిప్స్ చెబుతామని నమ్మించారు. ఇలా వ్యాపారి మొత్తం రూ.2.95 కోట్లు పెట్టుబడిగా పెట్టాడు. కానీ అతనికి కేటాయించిన ఐడీలో కనిపిస్తున్న లాభాలు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం లేకుండా చేశారు. దీంతో అతను మోసపోయానని గుర్తించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన అధికారులు కర్నాటకకు చెందిన సమీర్ హూండేక్కర్, దీపక్ సంపత్‌లను అరెస్టు చేశారు. దీని కోసం కమీషన్‌ల మీద ఖాతాలను తీసుకుని అందులో చీటింగ్ చేస్తున్న డబ్బును చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దర్యాప్తులోనే కోదాడకు సమీపంలో ఉన్న మూడు గ్రామాల విషయం తెలిసి పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది.
ఇద్దరు కూతుళ్లను టార్చర్ చేసిన తల్లి
కోదాడకు సమీపంలో ఉన్న ఓ గ్రామంలో ఓ మహిళకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారిద్దరిని చదివించింది. పెద్దామ్మాయి వివాహం చేసింది. చిన్న అమ్మాయి ఇంకా చదువుకుంటుంది. ఆ కుటుంబానికి అప్పులు బాగా పెరిగి పోయాయి. గ్రామంలో కొంత మంది యువత రోజువారీగా బాగా డబ్బులు సంపాదిస్తున్నారని తెలుసుకుని తల్లి తన ఇద్దరు కూతుళ్లను కూడా మీరు చదువుకున్నారు ఏం సంపాదిస్తున్నారంటూ తిట్టడం మొదలు పెట్టింది. గ్రామంలో మీ వయస్సు ఉన్న వారు ఎలా సంపాదిస్తున్నారో చూడండంటూ వేధించడం మొదలు పెట్టింది. దీంతో హైదరాబాద్ నుంచి వెళ్ళిన ఇద్దరు కూతుళ్లు సైబర్ చీటింగ్ ఉచ్చులో పడిపోయారు. సైబర్ నేరగాళ్లు యూఎస్ డాలర్స్‌ను ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసే చీటింగ్‌లో వీరు వారి ఖాతాలను ఇచ్చి కమీషన్‌లను తీసుకోవడం మొదలు పెట్టారు. అలా రోజు వారీగా డబ్బు వస్తుండడంతో ఈ ఇద్దరు యువతులు సైబర్ చీటింగ్ అలవాటు పడిపోయారు. కొన్ని సందర్భాల్లో వీరు వారి ఖాతాల్లో పడ్డ నగదును విత్ డ్రా చేసేసుకుని ఆ ఖాతాను క్లోజ్ చేసేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
బీటెక్ చదివావు.. ఏం సంపాదిస్తున్నావు
మరో ఇంట్లో తండ్రి వ్యవసాయం చేసుకుంటూ కొడుకుని హైదరాబాద్‌లో బీటెక్ చదివిస్తున్నాడు. ఇలా వ్యవసాయం చేస్తున్న తండ్రి గ్రామంలో ఇతరులను సైబర్ మోసగాళ్లకు ఖాతాలు ఇచ్చి రోజువారీగా వస్తున్న సంపాదనను చూసి, బీటెక్ చదువుతున్న కొడుకుని గ్రామానికి పిలిపించి నీవు చదివింది చాలులే, చూడు నేను రోజు సంపాదిస్తున్నా. నీవు ఇది నేర్చుకుని సంపాదించు అంటూ హూకుం జారీ చేశారు. కొడుకుకు ఇది ఇష్టం లేకపోయినా తండ్రి టార్చర్‌ను భరించలేక అతను కూడా సైబర్ మోసగాళ్లకు ఖాతాలు ఇచ్చి సైబర్ చీటింగ్‌ను ప్రొత్సహించే విధంగా రోజు వారి నగదుతో ఎంజాయ్ చేస్తున్నాడని పోలీసులు చెప్పారు. ఇలా ఈ రెండు కుటుంబాలే కాదు వందల మంది కుటుంబాలు ఇప్పుడు ఇలా సైబర్ మాయగాళ్ల ట్రాప్‌లో పడిపోయారు. ఇందులో కొంత మంది బాధితులై ఇప్పుడు ఇలా సైబర్ క్రిమినల్స్‌కు మద్దతిస్తు వారు సంపాదించుకుంటున్నారని, మరికొందరు రోజు వారిగా నగదు వస్తుండడంతో దీనికి అలవాటు పడిపోయారని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.