- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
79 ఏళ్ల వయసులో కూతురి ఏజ్ ఉన్న అమ్మాయిని నాలుగో పెళ్లి చేసుకున్న నటుడు.. నీకేం పోయేకాలం వచ్చిందంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు

దిశ, వెబ్‌డెస్క్: ప్రజెంట్ జనరేషన్‌లో ప్రేమ, పెళ్లి, విడాకులు, మళ్లీ పెళ్లి అనేది కామన్ అయిపోయాయి. ఇక సినీ ఇండస్ట్రీలో అయితే స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి నాలుగు, ఐదు పెళ్లి చేసుకున్న భర్తలు ఉన్నారు. అలాగే భార్యలు కూడా ఉన్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే నటుడు కూడా ఆ కోవకు చెందిన వాడే. ఒకటి కాదు రెండు కాదు 79 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లికి రెడీ అయ్యాడు. మరి ఇంతకీ ఆ యాక్టర్ ఎవరు అతని వివరాలేంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం..
బాలీవుడ్ నటుడు కబీర్ బేడి(Kabir Bedi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన హిందీతో పాటు పలు తెలుగు సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. అలా ‘శాకుంతలం’(Shakuntalam), ‘పైసా వసూల్’(Paisa Vasool), ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’(Gouthami Puthra Sathakarni) తదతర తెలుగు సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌ను పలకరించారీ సీనియర్ యాక్టర్. ఇక ఈ నటుడి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు ఆయన నాలుగు సార్లు వివాహం చేసుకున్నాడు. కబీర్ బేడి మొదటి వివాహం 1969లో నర్తకి ప్రొతిమా బేడితో జరిగింది.
వారిద్దరికీ పూజా బేడి, సిద్ధార్థ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత కబీర్.. బ్రిటిష్ ఫ్యాషన్ డిజైనర్ సుసాన్ హంఫ్రీస్‌ను రెండవసారి వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం కూడా ఎక్కువ కాలం నిలవలేదు, ఆ తర్వాత రేడియో ప్రెజెంటర్ నిక్కీని మూడవసారి వివాహం చేసుకున్నాడు కబీర్. కానీ ఈ వివాహ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. చివరికి వారు 2005 లో విడాకులు తీసుకున్నారు. అయితే కబీర్ బేడి 70 ఏళ్ల వయసులో మళ్ళీ ప్రేమలో పడి నాల్గవసారి వివాహం చేసుకున్నాడు.
భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ నటి, నిర్మాత పర్వీన్ దుసాంజ్‌ను కబీర్ నాల్గవసారి వివాహం చేసుకున్నాడు. పర్వీన్ కబీర్ కంటే సుమారు 30 సంవత్సరాలు చిన్నది. ఇక కబీర్ బేడి, పర్వీన్ దాదాపు 3-4 సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉంటూ మ్యారెజ్ చేసుకున్నారు. ప్రస్తుతం కబీర్ బేడీ వివాహం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఇక విషయం తెలుసుకున్న నెటిజన్లు పొట్టు పొట్టుగా తిట్టిపోస్తున్నారు. కూతురు ఏజ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని, ఏంటి ఈ చెండాలమంటూ, నీకెమ్ పోయేకాలం వచ్చిందంటూ ఫుల్‌గా తిడుతున్నారు.