TG Assembly: సీఎం పదేపదే ఆ మాట చెప్పడం సరికాదు.. హరీశ్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Shiva |
TG Assembly: సీఎం పదేపదే ఆ మాట చెప్పడం సరికాదు.. హరీశ్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ (Assembly) సమావేశాల్లో భాగంగా ఏడో రోజు బడ్జెట్‌పై చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే విపక్ష సభ్యుడు హరీశ్ రావు (Harish Rao) మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంచనాలు పూర్తిగా అవాస్తవికంగా ఉన్నాయని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో చేసి అప్పు రూ.4.22 లక్షల కోట్లు మాత్రమేనని తెలిపారు. కానీ, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాష్ట్రం దివాళా తీసిందని బహిరంగ వేదికలపై పదేపదే చెప్పడం సరికాదని అన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్‌ (BRS)పై కాంగ్రెస్ (Congress) దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) నుంచి రూ.22 వేల కోట్లు గ్రాంట్లు వస్తున్నాయని చెప్పారని, కానీ రూ.10 వేల కోట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని హరీశ్ రావు అన్నారు.

Advertisement
Next Story