- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మండలానికి ఒక స్వయం ఉపాధి యూనిట్ ను నెలకొల్పాలి

దిశ,వనపర్తి: ప్రతి మండలానికి ఒక స్వయం ఉపాధి యూనిట్ నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను సూచించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో స్వయం ఉపాధి కల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలలకు స్వయం ఉపాధి కల్పించడం ద్వారా ఆర్థిక,సామజిక పరిపుష్టి సాధించడం తో సాధికారత కొరకు అమలుచేస్తున్న పథకాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకునేలా చైతన్య పరచాలన్నారు. వనపర్తి జిల్లాలోని ప్రతి మండలంలో స్వయం ఉపాధి యూనిట్ నెలకొల్పే విధంగా మహిళా సంఘాలను ప్రోత్సహించాలని ఎ.పి.యం లను ఆదేశించారు. పెట్రోల్ బంక్, గోదాములు, రైస్ మిల్లు వంటి వ్యాపారం మొదలు పెట్టే విధంగా అవగాహన కల్పించాలన్నారు. మహిళా సంఘాలు యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకు వస్తె జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారాలు అందిస్తామని అవసరమైతే శిక్షణ సైతం ఇప్పిస్తామన్నారు.
యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అత్యధికంగా ఐకెపి మహిళా సంఘం సభ్యులకు కేటాయిస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ పకడ్బందీగా ఉండేందుకు ఏఈవోల ద్వారా శిక్షణ ఇప్పిస్తామన్నారు. కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన గన్ని బ్యాగులు అందజేస్తామన్నారు. వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న వారిలో చనిపోయిన వారి స్థానంలో జీవించి ఉన్న వారి భాగస్వామికి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయడంలో అలసత్వం వహించరాదన్నారు. వనపర్తి జిల్లాలో 451 మంది మరణించిన వృద్ధాప్య పెన్షన్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని,గ్రామాల వారీగా వివరాలు సేకరించి, మరణ ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు, భాగస్వామి బ్యాంక్ ఖాతా ఎంపీడీవో కార్యాలయంలో అందిస్తే ఏప్రిల్ 10 లోగా వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేసేందుకు చర్యలు తీయనుకోవాలన్నారు.
వచ్చే విద్య సంవత్సరానికి పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టించేందుకు మహిళా సంఘాలకు అప్పాజెప్పామన్నారు. మ్యాచింగ్ బ్యాచింగ్ పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థికి డ్రెస్ కొలతలు తీసుకొని విద్యార్థికి సరిపోయే విధంగా జూన్ 2 లోగా కనీసం ఒక జత యూనిఫారం సిద్ధం అయ్యే విధంగా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో ఇంచార్జీ అదనపు కలెక్టర్ యాదయ్య, పిడి డిఆర్డిఏ ఉమాదేవి,డిపిఎం అరుణ,ఏపిఎంలు తదితరులు పాల్గొన్నారు.