- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు

- 2 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- 53 శాతం నుంచి 55 శాతానికి పెరగనున్న డీఏ
- చివరి సారిగా 2024 జూలైలో డీఏ పెరుగుదల
దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఉద్యోగుల కరువు భత్యం (డీఏ)ను 2 శాతం మేర పెంచుతూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో ప్రస్తుతం 53 శాతం ఉన్న డీఏ 55 శాతానికి పెరగనుంది. దీంతో ఉద్యోగుల జీతాలు కూడా పెరుగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం చివరి సారిగా నిరుడు జూలైలో డీఏను పెంచారు. అప్పట్లో 50 శాతం ఉన్న డీఏ 53 శాతానికి పెరిగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు గాను ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ఇస్తాను. ఎప్పటికప్పుడు ఈ డీఏను సవరిస్తూ ఉంటారు. ప్రతీ ఏడాది రెండు సార్లు కరువు భత్యాన్ని సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డీఏను పరిహారంగా ఇస్తుంటారు. డీఏ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 48.66 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 66.55 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం జరుగుతుంది.
హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ పెంపును ప్రకటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే కాస్త ఆలస్యంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ) డేటా ఆధారంగా డీఏ రేట్‌ను నిర్ణయిస్తారు. ఏదైనా సవరణ నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం గత ఆరు నెలల గణాంకాలను తీసుకొని అంచనా వేస్తుంది. కాగా, జనవరి 1 నుంచి పెరిగిన డీఏ వర్తిస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.