మయన్మార్‌ త్వరగా కోలుకోవాలి: భూకంపంపై స్పందించిన చంద్రబాబు

by srinivas |   ( Updated:2025-03-28 14:46:58.0  )
మయన్మార్‌ త్వరగా కోలుకోవాలి: భూకంపంపై స్పందించిన చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: మయన్మార్‌ భూకంపం(Mayanmar earthquake)పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మయన్మార్‌ మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మయన్మార్ భూకంపంపై చెన్నై ఐఐటీ కాంక్లేవ్‌లో ఉన్న సమయంలో చంద్రబాబు ఆరా తీశారు. విపత్కర పరిస్థితుల నుంచి మయన్మార్‌ కోలుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరుకున్నారు.

కాగా మయన్మార్‌లో భూకంపం వణకించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రత నమోదు అయింది. మయన్మార్‌తోపాటు థాయిలాండ్ లోనూ రెండు సార్లు భూమి కంపించింది. దీంతో ఆస్పత్రులు, ఐకానిక్ వంతెన, ఎత్తైన ఆలయాలు, గోపురాలు పేకమేడలా కుప్పకూలాయి. ఈ మేరకు 163 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. వందల సంఖ్యలో గాయపడ్డారు. వీరందరిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. విషయం తెలుసుకున్న చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed