- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మీ కోసం మీరు నిలబడకపోతే మరెవ్వరూ నిలబడరు.. కన్నీళ్లు తెప్పిస్తున్న హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్(వీడియో)

దిశ, వెబ్‌డెస్క్: తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి(Sumaya Reddy) హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా తెరకెక్కిస్తున్న సినిమా ‘డియర్ ఉమ’(Dear Uma). పృథ్వీ అంబర్(Pruthvi Ambar) హీరోగా నటిస్తున్న ఈ మూవీకు సాయి రాజేష్ మహాదే(Sai Rajesh Mahadev) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 18న రిలీజ్ కాబోతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రస్తుతం ప్రమోషన్ల జోరు పెంచారు చిత్రబృదం. ఈ క్రమంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా సుమయ రెడ్డి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
‘ అమ్మాయిలందరికీ చెప్తున్నా.. రిజెక్షన్స్ ఈజ్ వెరీ కామన్.. బట్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్.. ఎవరో సహాయం చేస్తారని అస్సలు చూడకండి. మీ కోసం మీరు నిలబడకపోతే మీకోసం మరెవ్వరూ నిలబడరు, ఎవరైనా మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారంటే అది మీరే. ఒక అద్దం ముందు కూర్చుని లేదా నిలబడి మీకు మీరే హెల్ప్ చేసుకోండి. ఎందుకంటే మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కొన్ని సార్లు ఇంట్లో వాళ్లకి కూడా చెప్పుకోలేము కాబట్టి మీ కోసం మీరు మాత్రమే నిలబడండి’ అని బాగా కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.