- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఈడీని కాంగ్రెస్ ప్రారంభించింది.. ఈడీ సరైనదో కాదో వారే నిర్ణయించుకోవాలి: కేటీఆర్

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ అధికారులు కాంగ్రెస్ (Congress) నేతలు సోనియా, రాహుల్ గాంధీల పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ నేతలు బుధవారం దేశవ్యాప్తంగా ఉన్న ఈడీ (ED) ఆఫీస్‌ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఈ రోజు హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ (ED Office) ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన (Congress leaders protest) వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జాతీయ మీడియా ఛానల్‌తో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో EDని కాంగ్రెస్ ప్రారంభించింది. "ED సరైనదా కాదా అని కాంగ్రెస్ నిర్ణయించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో CBI, ఇతర సంస్థలను దుర్వినియోగం చేశారు. ఇప్పుడు, EDని దుర్వినియోగం చేయడం బిజెపి వంతుగా మారింది. రాహుల్ గాంధీ తమ CWC సమావేశంలో తాము అధికారంలోకి వస్తే ED ని తుడిచి పెడతామని ఒక తీర్మానాన్ని ఆమోదించాలి. ED దుర్వినియోగం అవుతుందని వారు నిజంగా భావిస్తే, వారు దేశ ప్రజలకు అలాంటి తీర్మానాన్ని హామీ ఇవ్వాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు.